Indoor-Plants

పీస్ లిల్లీ (Peace Lilies)

అత్యంత శక్తివంతమైన ఇండోర్ ఎయిర్ ప్యూరిఫయర్లలో పీస్ లిల్లీ ఒకటి. నీడలో ఈ మొక్క చాలా సులభంగా ఎదుగుతుంది. అంటే దీనికి సూర్యరశ్మితో పనిలేదు. దీని పచ్చని ఆకులు, తెల్లని పువ్వులు సంవత్సరం పొడవునా వికసిస్తూనే ఉంటాయి.

స్నేక్ ప్లాంట్ (Snake Plant)

Snake plants (Sansevieria trifasciata)

మీ బాత్ రూంలో తేమను తగ్గించాలనుకుంటే ఓ కుండీలో స్నేక్ ప్లాంట్‌ను తీసుకుని అనువైన చోట ఉంచండి. అంతేకాకుండా ఈ స్నేక్ ప్లాంట్‌కు విషవాయులను శోషించుకునే గుణం కూడా ఉంది. కాబట్టి గాలి కూడా స్వచ్ఛంగా మారుతుంది. ఇది ఎండ, నీడ.. రెండు చోట్ల బతుకుతుంది

మనీ ప్లాంట్ (Money Plant)

Money Plant ( Epipremnum aureum )

Available Golden Money Plant,Marble Prince Money Plant,Money Plant Green,Money Plant Marble Queen

ఇది చాలామందికి తెలిసిన ఇండోర్ ప్లాంట్. దీనిలోని గాలి శుద్ధిచేసే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. మనీ ప్లాంట్ గాలిని ఫిల్టర్ చేసి ఆక్సిజన్ ఇన్‌ఫ్లోను పెంచుతుంది.

కలబంద(Aloe Plant)

కలబంద (అలో వీరా) -Aloe Plant ( aloe barbadensis )

చర్మ సౌందర్యానికి కలబంద చాలా బాగా పనిచేస్తుందని మనకి తెలుసు. అలో వీరా జ్యూస్ కూడా ఆరోగ్యానికి చాలా మందిచి. అయితే మొక్క రూపంలో కూడా ఇది మనకు మేలు చేస్తుంది. కలబంద మొక్కను చిన్న కుండీలో నాటి ఇంట్లో పెట్టుకుంటే మనం పీల్చే గాలిని శుద్ధి చేస్తుంది.

చైనీస్ ఎవర్‌గ్రీన్ (Chinese Evergreen)

Chinese Evergreen (Aglaoneama)

ఈ మొక్కలు మనకు చాలా విరివిగా దొరుకుతాయి. అంతే సులువుగా పెరుగుతాయి కూడా. తక్కువ కాంతి ఉండే ప్రదేశాల్లో వీటిని ఉంచితే మంచిది. వీటిని మీ బాత్ రూంలో పెంచుకుంటే గాలిలో మలినాలను తొలంచి స్వచ్ఛంగా మారుస్తుంది. అలాగే ఇంటి ఆవరణలో కూడా దీన్ని పెంచుకోవచ్చు

బోస్టన్ ఫెర్న్ (Boston Fern)

Nephrolepis exaltata commonly called sword fern or Boston fern.

చాలా పేరొందిన మొక్క. ఎక్కడపడితే అక్కడ దొరుకుతుంది. ఇది ఇంటిలో వున్నదంటే చాలు ఆరోగ్యం సభ్యులందరకూ చేకూరినట్లే.

ఇంగ్లీష్ ఐవీ (English ivy)

English ivy Botanical Name is Hedera helix

మీరు ఆస్తమా రోగులైతే ఈ మొక్కను తప్పక పెంచాలి. ఇది కూడా విషపూరితమైన మొక్క. అలర్జీలు వున్న వారికి కూడా ఈ మొక్క ఇంటిలో వుంటే చాలు స్వస్ధత చేకూరుతుంది.

రబ్బరు ప్లాంట్ (Rubber Plant)

Rubber Plant Botanical Name is Ficus elastica

పొట్టిగా వుంటుంది. కుండీలలో పెంచవచ్చు. దీనినుండి జిగురు తీస్తారు. మలినాలను తీసేయాలంటే మంచి మొక్క. ఆకులు మందంగా వుండి దట్టమైన పచ్చని రంగులో వుంటాయి. అయితే దీని ఆకులే విషపూరితాలు కనుక జాగ్రత్త పడాలి. పిల్లలకు, పెంపుడు జంతువులకు అందుబాటులో వుండరాదు.

స్పైడర్ ప్లాంట్(Spider Plant)

Spider Plant Botanical Name is Chlorophytum Comosum

స్పైడర్ ప్లాంట్ ఎక్కువగా మోతాదులో పొల్యూషన్  పీల్చి కొనే మొక్కగా సైంటిస్ట్ లు గుర్తించారు ఇంట్లో స్ప్రెడ్ ఆయె హాని కరమైన వాయువులును నుంచి గాలిని పీల్చి,అంతే కాకా రేడియేషన్ పీల్చుకొని ఇంటిని హేయాల్టీ ఎన్విరాన్మెంట్ గా మార్చగలదు. గుబురుగా పెరుగుతుంది. దీనిని కూడా కుండీలలో పెంచవచ్చు.

అరెక పామ్ (Areca Palm)

Areca Palm Botanical Name is Chrysalidocarpus lutescens, Lady Palm (Rhapis excelsa),Bamboo Palm (Chamaedorea seifrizii),Dwarf Date Palm (Phoenix roebelenii)

వీటిని సాధారణంగా మనం కుండీలలో పెంచవచ్చు. బయట అనేక స్ధలాలలో కనపడుతూనే వుంటాయి. సన్నని ఆకులు కలిగి పొడవుగా ఎదుగుతాయి. వీటిలో లేడీ పామ్, డ్వార్ఫ్ పామ్, బాంబూ పామ్ అనే రకాలున్నాయి. ఏ రకమైనప్పటికి మంచిదే.

జ్ జ్ ప్లాంట్ (ZZ Plant)

ZZ Plant -Zamioculcas Zamiifolia

ఆక్సిజన్ ప్లాంట్ ,ఈ మొక్క ప్రతేయకత ఏమిటంటే ప్రతి రోజు రాత్రి ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది

పోఇంసెత్తియా (Poinsettia)

Poinsettia (Euphorbia pulcherrima)

క్రోటన్ (Croton)

Croton (Codiaeum variegatum pictum)

అంథోరియం (Anthurium)

Anthurium (Anthurium andraeanum)

వీపింగ్ ఫిగ్ (Weeping Fig)

Weeping Fig Botanical Name is Ficus benjamina

అజలేయా (Azalea)

Azalea  Botanical Name is Rhododendron

Most species have brightly colored flowers which bloom from late winter through to early summer. Azaleas make up two subgenera of Rhododendron.

లేడీస్ స్లిప్పర్ అర్చిడ్ (lady's-slipper orchid)

Cypripedium calceolus is a lady's-slipper orchid

Lady’s slipper,(subfamily Cypripedioideae),also called lady slipper or slipper orchid,subfamily of five genera of orchids (family Orchidaceae),in which the lip of the flower is slipper-shaped

తులసి (Indian Basil)

తులసి ప్రతి ఇంట్లో ఎంతో పవిత్రంగా పెట్టుకునే మొక్క. హిందువులు లక్ష్మీదేవి రూపంగా తులసి మొక్కను కొలుస్తారు. ఇండియాలోనే కాదు, విదేశాల్లో కూడా భారతీయులు తులసిని తమ ఇళ్ల ముందు కోటగా కట్టి కొలుచుకుంటున్నారు. తులసి ఇంట్లో ఉంటే పిల్లలకు ఏ గ్రహదోషాలూ అంటవని పూర్వీకుల నమ్మకం. తులసి రెండు రకాలు. ఎర్రపూలు పూసే మొక్కను కృష్ణతులసి అని, తెల్లపూలు పూస్తే లక్ష్మీతులసి అని పిలుస్తుంటారు.

తులసి ఆకుల వల్ల మనం చాలా జబ్బుల్ని దూరం చేసుకోవచ్చు. ఈ తులసి తన సహజ రంగును కోల్పోవడమో, ఆకులు సడన్‌గా ఎండిపోవడమో లేదా రాలిపోవడమో జరుగుతుంది. ఈ మార్పులను బట్టి ఇంట్లో వారికి భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చని పండితులు చెబుతుంటారు. తులసి చెట్టులో మార్పులు మన భవిష్యత్తును సూచిస్తాయన్న నమ్మకం చాలా మందిలో ఉంది.

తులసి ఆకులతో ఆరోగ్య ప్రయోజనాలు :
తులసిలో విటమిన్ ఏ, సీ, కేతోపాటూ కాల్షియం, జింక్, ఐరన్, క్లోరోఫిల్ సమృద్ధిగా లభిస్తాయి. అందుకే ఈ మొక్కను మందుల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీని ఆకులు, పువ్వులు, గింజలు అన్నీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. తులసి మొక్కకు పూసే తాజా పూలు బ్రాంకైటిస్ సమస్యను దూరం చేస్తాయి. మలేరియా ఉన్నవారు ఈ మొక్క ఆకులు, గింజల్ని... మిరియాలతో కలిపి తీసుకోవాలి. డయేరియా, వికారం, వామ్టింగ్స్ వచ్చేవారు ఈ మొక్క ఆకుల్ని తింటే చాలు ఇక సమస్య ఉండదు. కడుపులో అల్సర్లు, కళ్ల సమస్యలకు ఇది దివ్య ఔషధంలా పనిచేస్తుంది.

చర్మంపై మొటిమలు, మచ్చల్ని తులసి మటుమాయం చెయ్యగలదు. డయాబెటిస్ ఉన్నవారికి తులసి చక్కటి విరుగుడులా పనిచేస్తుంది. రకరకాల కేన్సర్ల బారిన పడకుండా కాపాడుతుంది. బీపీని అదుపులో ఉంచుతుంది. శరీరంలో అతి ముఖ్యమైన అవయవాల్లో ఒకటైన కాలేయాన్ని కాపాడుతుంది. హార్మోన్ల సమతుల్యతను కాపాడుతూ మానసిక ఒత్తిళ్లను తగ్గిస్తుంది. శ్వాసకోశ సంబంధ సమస్యల్ని దూరం చేస్తుంది. దంతాలను కాపాడుతుంది.

తులసిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు బాగా ఉన్నాయి. శరీరంలో మంటలు, నొప్పులు, వాపులు, దురదల్ని తగ్గిస్తుంది. ఎముకల నొప్పుల నుంచి వేగంగా సాంత్వననిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేసేలా సహకరిస్తుంది. గుండె ఆరోగాన్ని కాపాడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీ-బ్యాక్టీరియల్‌, యాంటీ-వైరల్‌గా పనిచేస్తుంది. రేడియేషన్‌ దుష్పరిణామాలు శరీరంపై పడకుండా పరిరక్షిస్తుంది. శుక్రకణాల సంఖ్యను పెంచి, సంతాన సాఫల్యతకు మేలు చేస్తుంది.

జుట్టు సమస్యలకు అద్భుత పరిష్కారంగా తులసి పనిచేస్తోంది. జుట్టు తెల్లబడటం, కుదుళ్లు బలహీనపడటం, చుండ్రు వంటి సమస్యలకు చక్కటి మందులా తులసి ప్రభావం చూపిస్తుంది. వెంట్రుకలు రాలిపోకుండా కాపాడుతుంది. గొంతునొప్పి, దగ్గును తులసి నివారిస్తుంది. బరువు తగ్గడంలో కూడా సహకరిస్తుంది.

ఇన్ని ప్రయోజనాలు ఉన్నందువల్ల తులసి ఆకులు, పూలు, గింజల్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల ఈ ఫలితాల్ని పొందవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు.

డ్రాగన్ ట్రీ (Dragon Tree)

Dragon Tree (Dracaena marginata)

Dracaena (Dracaena marginata),more commonly known as a dragon tree,is an attractive,stiff-leaved plant with green sword-like,red-edged leaves.The plant has narrow,slender gray stems that are topped with shiny,arching leave

సింగోనియం (Syngonium)

Syngonium (Syngonium podophyllum)

Umbrella plant

Schefflera / Umbrella Plant (Schefflera arboricola)

మూరుకొండ (Acalypha Hispida)

Common Name: Cat's Tail,Red Hot Cat Tail,Chenille Plant

Botanical Name:Acalypha Hispidia Burm.F