Avenue-Plants

ఏడాకుల చెట్టు(Alstonia scholaris)

Alstonia scholaris,commonly called blackboard tree or devil's tree.Grows up to 40 m (130 ft) tall. Flowers bloom in the month October.The flowers are very fragrant.The wood of Alstonia scholaris has been recommended for the manufacture of Pencils.

ఏడాకుల చెట్టు (సప్తపర్ణి )అనే ఈ సొగసైన సతతహరిత వృక్షం భారతదేశం యొక్క చాలా భాగాలలో కనిపిస్తుంది. దీని వృక్ష శాస్త్రీయ నామం ఆల్స్టోనియా స్కాలరీస్. ఈ జాతుల పేరు స్కాలరీస్, స్కాలరీస్ అనగా పండితుడు, ఈ స్కాలరీస్ పేరు ఎలా వచ్చిందంటే, పాఠశాల పిల్లలకు అవసరమయిన చెక్క పలకలను తయారు చేసేందుకు ఈ చెట్టు కలపను ఉపయోగించేవారు. ఆంగ్లంలో దీనిని డెవిల్ ట్రీ అంటారు, డెవిల్ ట్రీ అనగా దయ్యం చెట్టు, ఈ చెట్లపై దయ్యాలు నివాసముంటాయనే పుకార్లతో ఈ చెట్టు దయ్యం చెట్టుగా ప్రాచుర్యం పొందింది. అక్టోబరులో ఈ చెట్టు చిన్నని, ఆకుపచ్చని, సువాసన కలిగిన పుష్పాలను పుష్పిస్తుంది. ఈ చెట్టు యొక్క అన్ని భాగాలు విషపూరితమైనవిగా పరిగణిస్తారు. ఈ పొడవైన సొగసైన వృక్షం కఠినమైన బూడిదరంగు బెరడును కలిగివుంటుంది. ఈ చెట్టు యొక్క కొమ్మలు వలయంగా,, అలాగే ఆకులు ఒకే చోట అనేకం వస్తాయి. ఈ ఆకులు కొంచెం గుండ్రంగా, తోలు వలె ముదురు ఆకుపచ్చగా ఒక్కొక్క గుచ్ఛానికి 4 నుంచి 7 ఉంటాయి, దాదాపుగా ఒక్కొక్కొక గుచ్ఛానికి ఏడు ఆకులే ఉంటాయి, అందువలనే ఈ చెట్టును ఏడాకుల చెట్టు అని, హిందీలో సప్తపర్ణి అని అంటారు. ఈ చెట్టు చెక్క చాలా మృదువైనది, ఏదైనా తయారు చేయడానికి అనువైనది, కాబట్టి, ఈ చెక్కను సాధారణంగా ప్యాకింగ్ బాక్సుల, నల్లబల్లల తయారీలో ఉపయోగిస్తారు. ఈ చెట్టు బెరడును డీటా బార్క్ అంటారు, ఈ బెరడును అతిసారము, జ్వరం చికిత్సకు సంప్రదాయ ఔషధంగా ఉపయోగిస్తారు. దయ్యం చెట్టుగా పేరు పొందిన ఈ చెట్టు కింద కూర్చునేందుకు లేదా సేదతీరేందుకు పశ్చిమ కనుమల్లోని గిరిజన ప్రజలు అయిష్టత వ్యక్తం చేస్తారు, అక్కడ దయ్యముంటుందని భయపడతారు.

కదంబ(Cadamba)

Neolamarckia cadamba,with English common names burflower-tree,Laran & Leichhardt pine. It is  planted  Near Houses & on Road sides for the purpose of Dense shade.

కదంబ లేదా కదంబము (Cadamba) ఒక పెద్ద వృక్షం. దీని పుష్పాలు గుండ్రంగా బంతి వలె అందంగా ఉంటాయి. వీటిని లలితాదేవి పూజలో ప్రముఖంగా ఉపయోగిస్తారు

అంబ్రెల్లా ట్రీ (Schefflera Arboricola)

The Umbrella plant is also known as the Dwarf umbrella tree.Schefflera Arboricola is the scientific name.

వేపచెట్టు(Neem)

వేపచెట్టు, వేపాకు, వేపపూత ఇలా వేపచెట్టునుండి వచ్చే ప్రతి భాగము కూడా మనిషి ఆరోగ్యంలో పాలుపంచుకుంటున్నాయి. మనిషికి కావలసిన స్వచ్ఛమైన గాలిని ఈ వేప చెట్టు అందిస్తుంది, అలాగే ఆరోగ్యం కూడా. దీనివలన ప్రాచీనకాలం నాటినుండే మనిషి వేపతో అనుసంధానమయ్యాడు. ఇంటికి వాడే ద్వారబంద్రాలు, తలుపులు, కిటికీలు, బీరువాలు, మంచాలు తదితరవస్తువలన్నింటినీ ఈ వేపచెట్టు కాండంనుండే తయారు చేసుకుని వాడుకుంటున్నాడు. అలాగే వేపాకులను కూడా వైద్యానికి ఉపయోగిస్తారు. భారతదేశంలో వేప చెట్టును సాక్షాత్తూ లక్ష్మీదేవిగా జనం పూజిస్తారు. తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజు వేప, బెల్లం తినాలని శాస్త్రాలు చెపుతున్నాయి. అంటే వేప, బెల్లం తినడం వల్ల మనిషి శరీరం వజ్రంలా మారుతుంది.

Azadirachta indica commonly known as neem, nimtree or Indian lilac.Neem is a fast-growing tree that can reach a height of 15–20 metres (49–66 ft),and rarely 35–40 metres (115–131 ft).

మర్రి (Banyan)

Ficus benghalensis- Banyan is a type of strangling fig. The plant begins life growing on other trees and eventually envelops them completely. Aerial roots hang down from the branches and these eventually become trunks. This circle of trunks deriving from one original tree can reach an enormous size – 200 metres in diameter and 30 metres in height.Their welcome shade has made them important gathering places. Known in Hindu mythology as 'the wish-fulfilling tree', banyans represent eternal life

మర్రి  ఫైకస్ జాతికి చెందిన ఒక చెట్టు. ఇది బాగా విస్తరించిన శాఖలతో అనేకమైన ఊడలతో పెరిగే అతిపెద్ద వృక్షం. దీనినే వటవృక్షం అంటారు.

దీని గింజలు వేరే చెట్టు పగుళ్ళలో లేదా ఒరలలో (ఒకోమారు పెద్ద భవనాలు, వంతెనలు, రాళ్ళ సందులలో) చిగురించి కాలక్రమాన విస్తరిస్తాయి. "మర్రి" (Banyan) అనే పేరు ప్రత్యేకించి ఫైకస్ బెంగలెన్సిస్ (Ficus benghalensis) అనే జాతికి చెందిన చెట్లకు చెందుతుంది, కాని ఆ విధమైన ఇతర చెట్లకు, "యురోస్టిగ్మా" ఉపజాతికి చెందిన వాటికి, అన్నింటికీ కూడా ఈ పేరును వాడుతారు.

ఈ చెట్టు విత్తనాలు పళ్లు తినే పక్షుల చేత ఇతర ప్రదేశాలకు వెదజల్లబడతాయి. వేరే చెట్టుమీద పడి, దాని పగుళ్ళలో మొలకెత్తిన మొక్కల వేళ్లు క్రమంగా భూమికి ప్రాకుతాయి. కొమ్మలు ఆకాశంవైపు విస్తరిస్తాయి. ఇలా ఆశ్రయమిచ్చిన చెట్లను చుట్టుముట్టి పెరిగే లక్షణం ఉష్ణమండలంలో కాంతికోసం పోటీపడే చెట్లలో, ముఖ్యంగా "ఫికస్"జాతికి చెందినవాటిలో కనుపిస్తుంది.కనుక వీటన్నింటికి strangler fig అనే ఆంగ్లపదం వాడుతారు.

భారతదేశంలో "బనియాలు ('వణికులు' లేదా 'వ్యాపారులు') తమ ప్రయాణాలలో తరచు ఈ చెట్ల నీడలో విశ్రాంతి తీసుకొనేవారు అని విదేశీ పరిశీలకులు గమనించినందువల్ల దీనికి "బనియన్ ట్రీ" (ఫికస్ బెంగాలెన్సిస్) అనే పేరు పెట్టారు

రత్నగంధీ (Peacock Flower)

Botanical Name:Caesalpinia pulcherrima

Common Name - Peacock Flower, Pride of Barbados,Dwarf poinciana.

Peacock flower plant grows only to a height of about 3 meters, retains its leaves throughout the year.The most common color is red-orange, but one variety has pure yellow flowers.

పెద్దతురాయి(Gulmohar Tree)

Gulmohar Tree (గుల్మోహర్ చెట్టు)

కోడిపుంజు చెట్టు పూలలోని వంకర తిరిగిన కేశరములతో చిన్నపిల్లలు "కోడిపుంజు" ఆటలను ఆడుకుంటారు అందువలన ఈ చెట్టు కోడిపుంజు చెట్టుగా ప్రాచుర్యం పొందింది.

Also known as the Royal Poinciana, the royal flame tree, the peacock tree and scientifically called Delonix regia, this is a unique flower. Its bright crimson flowers adorn many beautiful gardens in the tropics and subtropics.

It is a large spreading and somewhat umbrella shaped tree with light, feathery, typical bipinnate leaves. The flowers are borne in large masses covering the whole tree. The flower color may be light orange, or deep scarlet and various intermediate shades.